విశాఖ నగరంలోని ఎంవిపి కాలని రైతు బజార్లో జాతీయ వినియోగదారుల వారోత్సవాలు సందర్భంగా ఆదివారం వినియోగదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు తూనికలు, కొలతలపై వినియోగ దారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లీగల్ మెట్రాలజీ స్మార్ట్ సిటీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అధికారులు, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ఎమ్.దామోదర్ నాయుడు పాల్గొన్నారు.