WG: నరసాపురం మండలం పీఎం లంక సొసైటీ త్రిసభ్య కమిటీ ఛైర్మన్గా పులపర్తి సూర్యారావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సభ్యులుగా కోడి వీర వెంకట సత్యనారాయణ, పొన్నమండ ముత్యాలరాజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో MLA బొమ్మిడి నాయకర్, టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ పొత్తూరి రామరాజు, మాజీ MLA జానకి రామ్, ఏఎంసీ ఛైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.