MDK: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 22న నూతన సర్పంచ్ల పదవీ బాధ్యతల స్వీకారానికి నిజాంపేట మండలం సిద్ధమైంది. మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో నూతన సర్పంచ్లు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ భవనాలకు రంగులు వేసి తీర్చిదిద్దారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని నూతన సర్పంచ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.