E.G: పల్స్ పోలియో సందర్భంగా ఆదివారం రాజమండ్రి కంబాలపేట మున్సిపల్ హెల్త్ సెంటర్లో DMHO డాక్టర్ కె.వెంకటేశ్వరరావు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజమండ్రిలో 183 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. తూర్పుగోదావరి (D) వ్యాప్తంగా 1,89,559 మంది చిన్నారులకు చుక్కలు వేసేలా ప్రణాళికలు చేశామని ఆయన పేర్కొన్నారు.