ప్రకాశం: ఒంగోలు పర్యటన నిమిత్తం ఇవాళ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత రానున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నూతన పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఒంగోలులోని డీటీసీ, పీటీసీల్లో కానిస్టేబుల్ శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి అనిత నేడు ప్రారంభించనున్నారు. ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.