MHBD: నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన జుబేదాబేగం (30) అనే మహిళ నిన్న ఇంటి అరుబయట పనులు చేస్తున్న క్రమంలో కరెంట్ షాక్ తగిలి అక్కడిక్కడే మృతి చెందింది. మృతురాలి బాబాయ్ షర్మిల్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు.