అన్నమయ్య: జిల్లా పుల్లంపేట మోడల్ స్కూల్ వద్ద ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు పుల్లంపేట (మం) పెరియవరం గ్రామానికి చెందిన చెన్నూరు వెంకటేష్‌గా గుర్తింపు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పుల్లంపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.