SKLM: స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో ఇవాళ క్రిస్టమస్ వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు ఆడిటోరియంలో ఈ వేడుకలు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజలందరూ హాజరై వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.