ADB: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివారం రూరల్ మండలంలోని బంగారుగూడ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన స్పోర్ట్స్ డే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. క్రీడల్లో పాల్గొనడంతో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.