MHBD: గూడూరు (M)దామరవంచ GPలో సర్పంచ్ ప్రమాణ స్వీకార వేళ విచిత్రం చోటుచేసుకుంది. BRS మద్దతుదారు స్వాతి, కాంగ్రెస్ మద్దతుదారు సుజాత ఇద్దరూ తామే సర్పంచ్‌గా గెలిచినట్టు ధ్రువపత్రాలు చూపిస్తూ ఆహ్వానాలు పంపుతున్నారు. మొదట 3 ఓట్లతో స్వాతి గెలిచినట్టు ప్రకటన జరిగినా రీకౌంటింగ్‌లో సుజాత 1 ఓటుతో గెలిచినట్టు రిటర్నింగ్ అధికారి నిర్ధారించారు. దీంతో ప్రమాణ స్వీకరంపై ఆసక్తి నెలకొంది.