TG: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. నీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలవనున్నారు. పలు ప్రాజెక్టులపై చర్చించనున్నారు. అలాగే రేపు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అవుతారు. తెలంగాణ నుంచి వరి ధాన్యం సేకరణ అంశంపై సమావేశం కానున్నారు.