NZB:రెంజల్ మండల పరిధిలోని బోరిగాంలో దారుణం జరిగింది.ఆదివారం ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొంగి పోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బస్వారెడ్డి, అతని భార్య మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన బస్వారెడ్డి తన భార్య రుక్మిణి (54)ని ఇంటి ఆవరణలో హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు.