కృష్ణా: మోపిదేవి మండల పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. విద్యుత్ లైన్ల మరమ్మతుల పనుల కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కౌతవరం, వడ్లమన్నాడు, రెడ్డిపాలెం, వేమవరం, వేమవరపాలెం, భీమునిగుంట, ఉలవలపూడి గ్రామాల్లో విద్యుత్తు నిలిపివేయనున్నట్లు ఏఈఈ శ్యామల తెలిపారు.