SKLM: ఎచ్చెర్ల మండలం కుశాలపురం వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల ఆవరణంలో ఈ రోజు నుంచి అంతర్రాష్ట్ర పాలిటెక్నికల్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోటీలలో జిల్లాలో ఉన్న తొమ్మిది కళాశాలల నుంచి సుమారు 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు.