PDPL: ఓదెల మండల నూతన ఎంపీడీవో గా వి.అనిల్ రెడ్డి నియామకం అయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నియామకం ఖరారు కాగా, మండల అభివృద్ధి, ప్రజాసేవలు, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పారదర్శక పాలనకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో మండలాన్ని ఆదర్శంగా నిలబెడతామని ఆయన అన్నారు.