JGL: నూతనంగా ఎన్నికైన కథలాపూర్ మండలంలోని దుంపేట గ్రామ సర్పంచ్ మల్యాల రమేష్, ఉపసర్పంచ్లు ఆదివారం కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు వేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. మారుతి, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, గోపాల్ రెడ్డి రవీందర్ పాల్గొన్నారు.