JN: ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్ జిల్లా కార్యవర్గ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. గైని శంకరయ్య జిల్లా జనరల్ సెక్రెటరీగా, నల్ల లలిత జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధానోపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అని వారు అన్నారు.