KDP: రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఇర్ఫాన్ భాష పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదు సంంత్సరాలలోపు ప్రతీ ఒక్కరికీ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించాలన్నారు.