VSP: పోర్టు స్టేడియంలో ఈ నెల 23, 24వ తేదీల్లో నిర్వహించనున్న ‘పీసా మహోత్సవ్’ ఏర్పాట్లను కేంద్ర పంచాయతీ రాజ్ జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్, రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ కృష్ణతేజ పరిశీలించారు. ఈ సందర్భంగా మహోత్సవ్ మస్కట్ అయిన ‘కృష్ణ జింక’ను, పీసా రన్ టీషర్టులను, టోపీలను సోమవారం ఆవిష్కరించారు. అనంతరం ఉత్సాహంగా మహోత్సవ్ బెలూన్ను గాలిలోకి విడిచిపెట్టారు.