VSP: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆదివారం విశాఖలోని 25వ వార్డు పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 25వ వార్డ్ కార్పొరేటర్ సారిపిల్లి గోవింద్, మాజీ స్టాండింగ్ కమిటీ మెంబర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులోని 0 నుంచి 5 సంవత్సరాలలోపు చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేశారు.