MDK: నర్సాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు చేయడానికి నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఇవాళ అర్పించిన అనంతరం నిరసన తెలిపారు.