KMM: తిరుమలాయపాలెం(M) చంద్రుతండా వద్ద KMM- WGL జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఓ ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ నితీష్ కుమార్ రామ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలాన్ని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.