TG: ప్రభుత్వంపై ప్రజలు ఆవేశంగా ఉన్నారని కేసీఆర్ అన్నారు. ‘ప్రతిపక్షంగా మన బాధ్యతను నిర్వహిద్దాం. మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు నీళ్లిచ్చాం. 90 శాతం పూర్తైన పాలమూరును ఇంకా ఎందుకు పూర్తి చేయలేదో నిలదీద్దాం. చెక్ డ్యామ్‌లను బాంబులు పెట్టి పేలుస్తారా? మేం వచ్చాక పేల్చినోడు పాతాళంలో ఉన్నా పట్టుకొస్తాం’ అని హెచ్చరించారు.