VSP: రుషికొండ ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ పేరుతో వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని విశాఖ జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనలో అభివృద్ధి నిలిచిపోయిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రం మొత్తం అభివృద్ధి సాధిస్తుందన్నారు.