ప్రకాశం: క్రీడాకారులందరూ క్రీడా స్ఫూర్తితో ఆడాలని, గెలుపు ఓటములు సహజమని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని కొత్తూరు వద్ద మెగా క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల వల్ల స్నేహ సంబంధాలు మెరుగుపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.