KNR: ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటగా, తాజాగా వీణవంక మండల పరిధిలోని రామకృష్ణాపూర్ సర్పంచ్ దూడపాక శ్రీవేణి-రాజు చేరికతో మరింత బలపడింది. ఈ మేరకు ఆదివారం హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.