SRCL: చందుర్తి మండలం బండపల్లి- కిష్టంపేట గ్రామాల మధ్య గల ఊర చెరువు కట్టపై రోడ్డుకు మరమ్మతు పనులు చేపట్టారు. రెండు గ్రామాల మధ్య రోడ్డు గుంతల మయంగా మారడంతో సర్పంచులు కటకం మల్లేశం,మోకినపల్లి దేవరాజు రోడ్డుపై మొరం మట్టి పోయించి ట్రాక్టర్‌తో చదును చేయించారు. దీంతో రెండు గ్రామాల ప్రజలకు గుంతల మయంగా మారిన రోడ్డుతో ఇక్కట్లు తప్పనున్నాయి.