NZB: ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీకు చెందిన రాజు గౌడ్ ఆర్మూర్ నుంచి 4వ సారీ శబరిమలకు సైకిల్ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సైకిల్ యాత్ర శనివారం శబరిమలకు చేరుకుందని ఆయన తెలిపారు. ఆదివారం అయ్యప్ప స్వామిని దర్శించుకున్నట్లు వివరించారు. ధర్మరక్షణ గోరక్షణ కొరకు తన వంతుగా పాటుపడుతున్నట్లు స్పష్టం చేశారు.