U19 ఆసియా కప్ ఫైనల్లో భారత్ ఓటమి అంచున నిలిచింది. పాక్ బౌలర్ల ధాటికి 16.5 ఓవర్లలో కేవలం 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పాక్ స్కోరుకు భారత్ ఇంకా 247 పరుగులు వెనుకబడి ఉంది. పాక్ బౌలర్లలో అలీ రజా 3 వికెట్లతో చెలరేగగా, సయ్యం, అబ్దుల్ సుభాన్ తలో 2 వికెట్లు తీసి టీమిండియాను కోలుకోలేని దెబ్బ తీశారు. ప్రస్తుతం క్రీజులో ఖిలాన్, హెనిల్ ఉన్నారు.