BHPL: రేగొండ గ్రామ సర్పంచ్‌గా విజయం సాధించిన వారణాసి మౌనిక-అంజి ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. BHPLలోని MLA గండ్ర కార్యాలయంలో సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో మౌనిక అంజి, వార్డు సభ్యులు మైస సురేందర్, తడక ప్రియాంక నరేష్, పల్లె కళ్యాణి అశోక్, బోగి లలిత సారయ్య, మేకల రాజుకు MLA గండ్ర కండువా కాంగ్రెస్ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.