ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మద్యం తాగుతున్న వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు జరిమానాలు విధించారు. అంతే కాకుండా మద్యం సేవించిన ప్రదేశాలను వారితోనే శుభ్రం చేయించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని, అందుకు కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.