ములుగు జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ యూనియన్ భవనంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు పోలు రాజు, కార్యదర్శి మేడి చైతన్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని వారు పేర్కొన్నారు. యూనియన్ నాయకులు తదితరులున్నారు.