జమ్మూకశ్మీర్ బిష్నాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రింగ్ రోడ్డు వద్ద ప్రమాదవశాత్తూ స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 35 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.