AP: కర్నూలు జిల్లా తొగలగల్లులో దారుణం చోటుచేసుకుంది. తన అన్నను హత్య చేయించిందన్న కక్షతో మరిది పెద్దయ్య.. వదిన గంగావతి(30)ని రోకలి బండతో కొట్టి చంపాడు. స్థానికుల కథనం.. 3 నెలల క్రితం ఆమె తన ప్రియుడితో కలిసి భర్త అహోబిలాన్ని హత్య చేయించింది. దీంతో ఇటీవలే సబ్ జైలుకి వెళ్లి వచ్చిన ఆమెపై మరిది అర్ధరాత్రి వేళ దాడి చేసి చంపేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.