BHNG: నేడు భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా జరగబోయే నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు పోచంపల్లి మండలం పిల్లాయిపల్లి, జూలూరు, 11 గంటలకు బీబీనగర్ మండలం రాఘవపురం, బీబీనగర్, 12 గం.కు భువనగిరి మండలం గౌస్ నగర్, 12:30 గం.కు వలిగొండ మండలం పులిగిల్ల, వలిగొండ, మాందాపురం గ్రామాల్లో పాల్గొంటారు.