NZB: ఆర్మూర్, బోధన్ కోర్టులతో పాటు, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టులలో నిర్వహించిన జాతీయ ‘లోక్ అదాలత్’లో సివిల్, రాజీకి వీలున్న క్రిమినల్ కేసులు మొత్తం 63,790 రాజీ పద్ధతిన పరిష్కారం అయినట్లు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సాయి సుధ తెలిపారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకు ఐదవ స్థానం లభించిందని ఆమె తెలిపారు.