WNP: కొత్తకోట మండలంలోని రామనంతపురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్‌గా సోమవారం రాజాపురం యాదగిరిరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే సమక్షంలో వారు బాధ్యతలు స్వీకరించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.