NLG: కొత్త సర్పంచ్లు, వార్డు సభ్యులు నేడు ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు విడతల్లో జరిగిన, గ్రామపంచాయతీ ఎన్నికల్లో 1,779 గ్రామపంచాయతీలకు కొత్త పాలక వర్గాలను ఎన్నుకున్నారు. వారి ప్రమాణస్వీకారానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు అన్ని ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు.