ADB: కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డిలతో భేటి అయ్యారు. శనివారం హైదరాబాద్లో వారిని మర్యాదపూర్వకంగా కలిసిన డీసీసీ అధ్యక్షుడు ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించారు.