నల్లగొండ పట్టణానికి తాగునీరు సరఫరా చేసే నీటి శుద్ధి కేంద్రానికి సంబంధించిన వాటర్ పంప్ హౌస్ వద్ద మరమ్మతుల పనులు చేపడుతున్నట్లు నల్లగొండ పురపాలక సంఘం ప్రకటించింది. ఈ పనుల కారణంగా 21, 22 తేదీల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఈ సమయంలో పట్టణంలోని కొన్ని వార్డులకు మాత్రమే నీటి సరఫరా జరుగుతుందని, 23 నుంచి యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందని మున్సిపల్ అధికారులు తెలిపారు.