కేరళలోని శ్రీఅనంత పద్మనాభస్వామి ఆలయంలోకి కెమెరా అమర్చిన కళ్లజోడుతో ఓ పర్యాటకుడు ప్రవేశించాడు. ఆలయ ఉత్తరం వైపు, తులాభారం మండపంతోపాటు ఇతర ప్రదేశాలను చిత్రీకరించాడు. దీన్ని గుర్తించిన ఆలయ భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. అనంతరం ఫోర్ట్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సింగపూర్ నివాసి తిరునీపనార్(49)గా గుర్తించారు.