అనకాపల్లి: కోటవురట్ల మండలంలో ఆదివారం ఉదయం 6 గంటలకు పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. 28 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పీ.హెచ్.సీ. వైద్యాధికారి డాక్టర్ సంతోష్ కుమార్, ఎంపీహెచ్ఓలు బుల్లిబాబు, బెన్నయ్య తెలిపారు. 2096 మందికి పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. పల్స్ పోలియో కేంద్రాల్లో అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పోలియో చుక్కలు వేస్తున్నారు.