వరంగల్ జిల్లాలో కూరగాయల ధరలు సామాన్యులకు భారంగా మారాయి. టమాట, బెండకాయ, దొండకాయ, చిక్కుడు, క్యారెట్, దోసకాయ, పచ్చిమిర్చి కిలోకు రూ. 80 పలుకుతుండగా బీరకాయ రూ. 70,క్యాప్సికం రూ. 100కి చేరింది. ఉల్లిగడ్డ కిలోకు రూ. 40గా ఉంది. ధరల పెరుగుదలతో గృహిణులతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు చేస్తున్న సంఘాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.