JN: దేవరుప్పుల మండలం రామరాజుపల్లి గ్రామంలో సీపీఎం బలపరిచిన 5వ వార్డు అభ్యర్థి కొప్పుల ఉప్పలయ్య ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా సీపీఎం దేవరుప్పుల మండల కమిటీ ఆధ్వర్యంలో వారిని ఇవాళ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగార రమేష్, మండల కార్యదర్శి ఇంటి వెంకటరెడ్డి, మండల కమిటీ సభ్యుడు పయ్యావుల బిక్షపతి ఉన్నారు.