TG: సిద్ధిపేట జిల్లా దాచారంలో విషాదం జరిగింది. అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. శ్రీహర్ష అనే వ్యక్తి తన స్నేహితుడికి అప్పు ఇప్పించాడు. స్నేహితుడు మోసం చేయడంతో శ్రీహర్షను అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి తెచ్చారు. దీంతో శ్రీహర్ష, రుక్మిణి దంపతులు ఐదుగురి పేర్లు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.