ADB: యువత దేశ సేవలలో ముందుంటూ ఆదర్శంగా నిలవాలని మున్సిపల్ మాజీ ఛైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. క్రాంతి నగర్‌కు చెందిన రోడ్డ సృజన్, ఆవుల వేణు, సుంకరి చందన్ ఆర్మీ ఉద్యోగాలు పొందడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆదివారం బీఆర్ఎస్ కార్యాలయంలో వారిని శాలువాతో సత్కరించి అభినందించారు.