NGKL: అమ్రాబాద్ మండలం మన్ననూరులో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో 2 కోట్ల 70 లక్షల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నూతన భవనానికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదివారం భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అచ్చంపేట నియోజకవర్గంలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.