SRD: రామచంద్రాపురం మండల విద్యాధికారిగా మూర్తి రాములు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం బీహెచ్ఈఎల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న అయన రామచంద్రాపురం మండల విద్యాధికారిగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మండల విద్యాధికారిని శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.