ఆలూరు టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు ఆస్పరిలో నారా బ్రాహ్మణి జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారని పార్టీ నాయకులు, MRPS నాయకులు సంజప్ప కొనియాడారు. ఇందులో భాగంగా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.