శ్రీకాకుళం: సోంపేట మండలంలోని బారువ బీచ్లో సముద్రం వెనక్కి వెళ్లింది. ఒక్కసారిగా 50 మీటర్ల మేర వెనకకు వెళ్లడంతో పర్యాటకులు ఈ వింతను చూసేందుకు తరలివచ్చారు. దీనికి తోడు ఎంతో తక్కువ ఎత్తులో అలలు ఎగిసిపడుతూ ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ వాతావరణాన్ని పర్యాటకులు ఆస్వాదించారు. గత రెండు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు.